తెలంగాణ

telangana

ETV Bharat / state

తెగిన కాగ్నా నదీ వంతెన.. రోడ్లన్నీ జలమయం - తాండూరు తాజా వార్తలు

వికారాబాద్​ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కాగ్నా నదీ వంతెన తెగిపోయింది. ఇది ఐదేళ్లలో రెండోసారి. దీనితో తాండూర్​ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి.

Penna River Bridge was severed at tandoor in vikarabad district
తెగిన కాగ్నా నదీ వంతెన.. రోడ్లన్నీ జలమయం

By

Published : Jul 3, 2020, 10:33 AM IST

Updated : Jul 3, 2020, 10:40 AM IST

తెగిన కాగ్నా నదీ వంతెన.. రోడ్లన్నీ జలమయం

వికారాబాద్​ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికీ తాండూర్​ కాగ్నా నదీ వంతెన తెగిపోయింది. దీనివల్ల మహబూబ్​నగర్​ తాండూర్​ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఐదేళ్లలో వంతెన తెగిపోవడం ఇది రెండోసారి.

2016లో కురిసిన వర్షాలకు కాగ్నా నది వంతెన తెగిపోయింది. ఆ వంతెనకు తాత్కాలికంగా మరమత్తులు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కోటి రూపాయల నిధులను మంజూరు చేసింది. పాత వంతెన పక్కనే కొత్త వంతెన నిర్మాణం చేపట్టింది. కొత్త వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల పాత వంతెన మీద నుంచే గత ఐదేళ్లుగా రాకపోకలు కొనసాగాయి. మళ్లీ భారీ వర్షాలకు పాత వంతెన మరోసారి కొట్టుకుపోయింది. దీనితో కథ మొదటికి వచ్చింది.

తాండూర్ నియోజకవర్గంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లాయి. దీనితో అటు హైదరాబాద్​ టూ జహీరాబాద్​, సంగారెడ్డి, మహబూబ్​నగర్​ మార్గాలలో తాండూర్​కు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

Last Updated : Jul 3, 2020, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details