తెలంగాణ

telangana

ETV Bharat / state

'కార్యకర్తల కోసమే పార్టీ ఆఫీసులు' - MPP OFFICE INAGURATION WORTH RS.1 CRORE

పార్టీ కార్యకర్తలకు నాయకులను అందుబాటులోకి తెచ్చేందుకే జిల్లా కేంద్రాల్లో తెరాస కార్యాలయాల నిర్మాణానికి అధ్యక్షుడు కేసీఆర్ శ్రీకారం చుట్టారని వికారాబాద్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా రెడ్డి అన్నారు. అనంతరం పార్టీ నూతన కార్యాలయానికి ఆమె భూమి పూజ చేశారు.

ప్రతీ ఎమ్మెల్యే రెండు రోజులకు ఒకసారి జిల్లా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు : సునీతారెడ్డి

By

Published : Jun 24, 2019, 5:11 PM IST

వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస కార్యాలయ భవన నిర్మాణానికి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి జడ్పీ ఛైర్​పర్సన్ భూమి పూజ చేశారు. దసర రోజునే నూతన భవనాలు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం కోటి రూపాయలతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
గతంలో నాయకులను కార్యకర్తలు కలవాలంటే వందల కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వచ్చేదని ఇప్పుడా పరిస్థితిని మార్చేందుకే పార్టీ కోసం నూతన భవనాలను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తైన తర్వాత ప్రతీ ఎమ్మెల్యే రెండు రోజులకోసారి జిల్లా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని వివరించారు.

పార్టీ నూతన కార్యాలయానికి భూమి పూజ చేసిన సునీతారెడ్డి
ఇవీ చూడండి : 29 జిల్లాల్లో ఘనంగా పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details