దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా దోమ ఎంపీడీవో కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
''నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లలు భారం కాకూడదనే''..
కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తోందని పరిగి ఎమ్మెల్యే తెలిపారు. వికారాబాద్ జిల్లాలో లబ్ధిదారులకు చెక్లు పంపిణీ చేశారు.
''నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లలు భారం కాకూడదనే''..
రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లలు భారం కాకూడదనే ఉద్ధేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాలని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబాలు కల్యాణలక్ష్మి పథకం ద్వారా సంతోషంగా పెళ్లిళ్లు జరుపుకుంటున్నారని తెలిపారు.
ఇదీ చదవండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రేపు కేసీఆర్ సమీక్ష