తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహేశ్​రెడ్డి - పరిగి వార్తలు

పురపాలక నిధులతో వికారాబాద్​ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న రహదారి పనులకు ఎమ్మెల్యే మహేశ్​రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

mla mahesh
రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహేశ్​రెడ్డి

By

Published : Sep 24, 2020, 1:47 PM IST

వికారాబాద్​ జిల్లా పరిగి పురపాలిక పరిధిలోని రోడ్లు నిర్మాణ పనులను ఎమ్మెల్యే మహేశ్​రెడ్డి ప్రారంభించారు. రూ.1.4 కోట్ల మున్సిపల్​ నిధులతో వీటిని చేపడుతున్నారు. తహసీల్దార్​ కార్యాలయం నుంచి టెలిఫోన్​ భవన్​ వరకు, అంబేడ్కర్​ చౌరస్తా నుంచి గాంధీ చౌక్​ వరకు రహదారులను నిర్మించనున్నారు. పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను.. ఎమ్మెల్యే ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ ఛైర్మన్​ ముకుందా అశోక్, కో- ఆప్షన్ సభ్యుడు ముకుంద శేఖర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇవీచూడండి:డ్రగ్స్​: వ్యసనం.. వ్యాపారం.. అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details