మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్దంతి సంధర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్లో పల్స్ ఆక్సీమీటర్లు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సోనియా గాంధీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టామని రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
'కరోనాకు ఉచితంగా చికిత్స అందిస్తా' - జర్నలిస్టులు, పోలీసులు, ప్రజలకు పల్స్ ఆక్సీమీటర్లు అందజేసిన పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి... జర్నలిస్టులు, పోలీసులు, ప్రజలకు పల్స్ ఆక్సీమీటర్లు, మాస్కులు, శానిటైజర్లను అందజేశారు.
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పల్స్ ఆక్సీమీటర్ల పంపిణీ
జిల్లాలో ఎవరైనా కరోనాతో బాధపడితే వారికి తన ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తానని అన్నారు. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి జిల్లాకు చెందిన దాదాపు 50 మంది కరోనా బాధితులు తన ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారని రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు