వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కృష్ణమ్మ గుడితండాలో పురాతన శ్రీ కృష్ణ దేవాలయ పునరుద్ధరణ పనులను మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన సొంత డబ్బులతో ప్రారంభించారు. రూ.50,000 అందించి.. జేసీబీతో పనులు మొదలుపెట్టారు.
సుమారు 200 ఏళ్ల నాటి దేవాలయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో శిధిలావస్థకు చేరుకుందని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గుడికి సంబంధించిన భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొన్ని భూములు కబ్జాలు కాకుండా చూశామని పేర్కొన్నారు. గుడి పేరు మీద తండా ఉన్నపటికీ.. గుడి లేకుండా పోవడం బాధాకరమన్నారు. గుడికి పూర్వ వైభవం తెచ్చి విగ్రహావిష్కరణ చేపడతామని చెప్పారు. అన్యాక్రాంతం అయిన దేవాలయ భూములను కాపాడతామన్నారు.