వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలోని వివేకానంద కూడలిలో రాజస్థానీ మార్వాడీలు గణనాథునికి వైభవంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థానీయులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తమ సొంత గ్రామంలో ఎలా పూజలు చేస్తామో ఇక్కడ అలానే చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా భాజపా అధ్యక్షులు కరణం ప్రహలాద్ రావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీఎమ్ఎస్ ఉపాధ్యక్షులు బోలుసాని బీమ్ రెడ్డి, ఎస్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
గణనాథునికి మార్వాడీల విశేష పూజలు - కులకచర్ల మండల కేంద్రం
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో గణనాథునికి రాజస్థానీ వారు ఘనంగా పూజలు నిర్వహించారు. తోటి వారు కూడా తమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు.
![గణనాథునికి మార్వాడీల విశేష పూజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4321220-566-4321220-1567461876901.jpg)
ఘణనాధునికి మార్వాడీల విశేష పూజలు