తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి - వికారాబాద్​ జిల్లా తాజా వార్త

నూతన భవనానికి నీళ్లు పడుతుండగా హై టెన్షన్​ విద్యుత్​ వైర్లు తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వికారాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

one man dead with electric shock in parigi vikarabad
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి

By

Published : Apr 24, 2020, 9:01 PM IST

వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుఘాతానికి గురై జాకీర్ (21)అనే యువకుడు మృతి చెందాడు. జాకీర్ కుటుంబ సభ్యులు గ్రామంలో నూతన భవనం నిర్మిస్తున్నారు. ఆ భవనానికి అతి సమీపంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయి.

నూతనంగా నిర్మిస్తున్న భవనానికి జాకీర్ పైప్​తో నీళ్లు పడుతుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై జాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో జాకీర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవీచూడండి:తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్

ABOUT THE AUTHOR

...view details