వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. సొంత అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు భగ్గుమన్నాయి. రెండెకరాల పొలం కోసం సొంత సోదరులే ఒకరినొకరు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఈ క్రమంలో తమ్ముడు యాదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
భూమి కోసం తమ్ముడిపై హత్యాయత్నం - one man attempt to murder his own brother in parigi
నీకు ఉద్యోగం ఉంది. నీ భూమిలో పంట పండించుకుంటానని తమ్ముడితో అన్నాడు. అది ఇష్టం లేని తమ్ముడు... నా భూమిలో నీకేం పని, నీ భూమి నువ్వే చేసుకో అని అన్నతో చెప్పాడు. ఇదే వారిద్దరి మధ్య గొడవకు కారణమైంది. తీవ్ర కోపోద్రిక్తుడైన అన్న తమ్ముడిని కర్రలు, రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశాడు.
![భూమి కోసం తమ్ముడిపై హత్యాయత్నం one man attempted to murder his brother](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7497683-542-7497683-1591418823953.jpg)
భూమి కోసం తమ్ముడిపై హత్యాయత్నం
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు యాదయ్యను పోలీసు వాహనంలో పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి పంపించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:జిల్లాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా