వికారాబాద్ జిల్లా వికారాబాద్‌లోని అనంతగిరిలో శ్రీ అనంతపద్మనాభ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటా కార్తీక పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని జరుపుతారు. ఈ నెల 7న ధ్వజారోహణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా జరిగాయి. దేవాలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకిలో తెచ్చి రథంపై ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి రథయాత్రని ప్రారంభించారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కలిసి రథాన్ని లాగారు. గోవింద నామస్మరణల మధ్య అనంత పద్మనాభుని ఉరేగింపు ప్రాంతం ఆధ్యత్మిక శోభతో వెల్లువిరిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఘనంగా అనంతపద్మనాభుని రథోత్సవం
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో శ్రీ అనంత పద్మనాభ స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటా కార్తిక పౌర్ణమి రోజు జరిగే ఈ రథయాత్రకి వేలాదిగా భక్తులు తరలివస్తారు. స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని అనంత పద్మనాభుని శోభాయాత్రలో ప్రారంభించారు.
కార్తిక పౌర్ణమి నాడు.. ఘనంగా అనంతపద్మనాభుని రథోత్సవం