తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పంజా: వికారాబాద్​లో మరో కొవిడ్​ మరణం - corona cases in vikarabad

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతోపాటు... మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. వికారాబాద్​ జిల్లాలో మరో కరోనా మరణం నమోదైంది. వారం తిరగకుండా ఇది రెండో మరణం కావటం వల్ల జిల్లాలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

old women died with corona in vikarabad district
కరోనా పంజా: వికారాబాద్​లో మరో కొవిడ్​ మరణం

By

Published : Jun 30, 2020, 8:03 PM IST

వికారాబాద్ జిల్లాలో మరో కరోనా మరణాన్ని జిల్లా వైద్యాధికారులు ధ్రువీకరించారు. వారం తిరగకుండానే రెండో మరణం సంభవించగా.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వికారాబాద్ పట్టణానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు వారంరోజుల కిందట కరోనా బారిన పడింది. నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. వృద్ధురాలి కుమారుడు సైతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నాడు. ఈ మరణంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

ఇదీ చూడండి:భారత్‌ బయోటెక్‌కు గవర్నర్‌ తమిళిసై అభినందనలు

ABOUT THE AUTHOR

...view details