తెలంగాణ

telangana

ETV Bharat / state

తాండూరులో కారుతో పాటు వృద్ధుడు సజీవదహనం - old man burnt alive at tandur

వికారాబాద్ జిల్లా  తాండూరులో దారుణం చోటుచేసుకుంది. పాడుబడిన కార్​లో పడుకున్న వృద్ధుడు వాహనంతో సహా సజీవదహనం అయ్యాడు.

old man died after caught fire in a car
తాండూరులో కారుతోపాటు వృద్ధుడు సజీవదహనం

By

Published : Jan 20, 2020, 10:20 AM IST

వికారాబాద్​ జిల్లా తాండూరులోని మర్రిచెట్టు కూడలి ప్రాంతంలో మూడేళ్ల నుంచి ఓ వ్యక్తి పాడుబడిన తన కారును ఉంచాడు. అదే ప్రాతంలో భిక్షాటన చేసుకునే వీరన్న అనే వృద్ధుడు రోజు ఆ కారులో పడుకునేవాడు.

ఎప్పటిలాగే ఆదివారం కూడా వీరన్న కారులో నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో కారులో మంటలు చెలరేగి వీరన్న అక్కడికక్కడే వాహనంతో పాటు సజీవ దహనమయ్యాడు.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ ఘటనాస్థలిని పరిశీలించారు. మర్రిచెట్టు కూడలి సమీపంలో అమ్మవారి జాతర ఉత్సవాలు జరిగాయి. కారు ఉన్న స్థలంలో టెంటు వేసి జాతరకు వచ్చిన భక్తులు వంట చేశారు.

తిరిగి వెళ్లే అప్పుడు వంట చేసిన స్థలంలో అగ్గిని పూర్తిగా చల్లార్చకపోవడం వల్ల నిప్పు రాజుకుని మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

తాండూరులో కారుతోపాటు వృద్ధుడు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details