ఖమ్మం జిల్లా ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య సంఘటనపై తాండూర్‌లో కార్మికులు కొవ్వత్తూలు వెలిగించి సంతాపం తెలిపారు. అతని చిత్రపటానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి అంబేద్కర్ కూడలి, ఆచార్య జయశంకర్ కూడలి మీదుగా కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
వృథా కాదు నీ మరణం... శ్రీనివాస్‌రెడ్డికి కొవ్వొత్తుల నిరసన - వృథా కాదు నీ మరణం.. కొవ్వత్తూలతో నిరసన
ఆర్టీసీ కార్మికుల సమ్మె వికారాబాద్ జిల్లా తాండూరులో తొమ్మిదో రోజు ఉద్ధృతంగా కొనసాగింది. కార్మికులు సమ్మె శిబిరంలో శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా కొవ్వత్తూలతో నిరసన తెలిపారు. వృథా కాదు నీ మరణం అంటూ నినాదాలు చేశారు.
వృథా కాదు నీ మరణం.. కొవ్వత్తూలతో నిరసన