వికారాబాద్ జిల్లా కులకచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో తెరాస నుంచి పలువురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. గులాబీ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి... స్థానిక ఎమ్మెల్యే మహేశ్ రెడ్డితో కలిసొచ్చి సహకార సంఘం కార్యాలయంలో నామ పత్రాలు దాఖలు చేశారు.
సహకార సంఘలకు జోరుగా నామినేషన్లు - సహకార సంఘల ఎన్నికలు
రాష్ట్రంలో వ్యవసాయ సహకార సంఘల ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటీ పడ్డారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో తెరాస నుంచి పలువురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.
సహకార సంఘ నామినేషన్లు
గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తెరాసకు చెందిన అభ్యర్థులు ఘన విజయం సాధించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పుడు కూడా సహకార సంఘం ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:ముగింపు నేడే: సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం