వంద అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని వికారాబాద్ జిల్లా పాలనాధికారి మస్రత్ ఖనమ్ అహేశ పేర్కొన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటించారు. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దీనివల్ల విష జ్వరాలను అరికట్టవచ్చన్నారు. గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన పలువురు గ్రామస్థులకు జరిమానా విధించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్ - వికారాబాద్ జిల్లా
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో జిల్లా పాలనాధికారి మస్రత్ ఖనమ్ అహేశ పర్యటించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్