Vijay sapla at Marpally: పరువు హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేసు విచారణ వేగవంతంగా జరిగేందుకు కృషి చేస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విజయ్ సాప్లా హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో నాగరాజు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిగేలా చూస్తామని తెలిపారు.
"నాగరాజు కుటుంబానికి రూ 8.50 లక్షల సాయం ఆర్థికసాయం అందిస్తున్నాం. తక్షణమే వారికి యాభైశాతం అందజేస్తాం. వారికి మూడెకరాల భూమి కేటాయిస్తాం. అలాగే రెండు పడక గదులు ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తాం. నాగరాజు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం." - విజయ్ సాప్లా, జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్