తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోలింగ్​ కేంద్రాల్లో ఒకరోజు ముందే అన్ని ఏర్పాట్లు చేయాలి' - ఎన్నికలకు రంగం సిద్ధం

పురపాలక ఎన్నికలు పకడ్బంధీగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా ఎన్నికల పరిశీలకురాలు హైమావతి అధికారులను ఆదేశించారు.

municipal elections programs
'పోలింగ్​ కేంద్రాల్లో ఒక రోజు ముందే అన్ని ఏర్పాట్లు చేయాలి'

By

Published : Jan 14, 2020, 1:32 PM IST

వికారాబాద్​ జిల్లా తాండూర్​లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు హైమావతి పరిశీలించారు.

పోలింగ్​కి ఒక్కరోజు ముందుగానే అధికారులు, సిబ్బందికి పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలకు సంబంధించి చిట్టాను అధికారులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లతో పాటు భోజన వసతి కల్పించాలని అధికారులకు ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధవరం, పురపాలక కమిషనర్ మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

'పోలింగ్​ కేంద్రాల్లో ఒక రోజు ముందే అన్ని ఏర్పాట్లు చేయాలి'

ఇవీ చూడండి: ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ?

ABOUT THE AUTHOR

...view details