Revanth reddy fire on bjp, trs: రాష్ట్రంలో భాజపా, తెరాస పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. పంటను అమ్ముకునే దారి లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్ పట్టణంలోని గాంధీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. అనంతరం తన నివాసం నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెరాస, భాజపాలపై రేవంత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు.
తెరాస, భాజపాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై తెరాస ఎంపీలు ఇంతవరకూ విపక్షాలను కలవలేదు. పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటం. - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Revanth reddy fire on bjp, trs: రాష్ట్రంలో సాగు చేసిన పంటను అమ్ముకోలేక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు ఆందోళన చెంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలపై ప్రశ్నించాల్సిన ప్రభుత్వం.. పార్లమెంటులో నిరసన కార్యక్రమం పేరిట కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రైతుల తరపున ప్రశ్నించకుండా సభ నుంచి బయటికి రావడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. తెరాస పార్టీ ఎంపీలు.. దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేతలతో చర్చించి వరిసాగు విషయంలో పార్టీలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. కానీ ఎంపీలు తూతూ మంత్రంగా విచారణ చేపట్టి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు.
తెరాస, భాజపాది కుమ్మక్కు రాజకీయం: రేవంత్ రెడ్డి ఇదీ చదవండి:All Party Dharna at Indira Park: 'వానాకాలం ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి'