తెలంగాణ

telangana

ETV Bharat / state

'కమీషన్ల కోసమే జగన్​తో కుమ్మక్కు' - కేసీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్​రెడ్డి

కమీషన్ల కోసమే ఏపీ సీఎం జగన్​తో చేతులు కలిపి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ​ అన్యాయం చేస్తున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. పక్క రాష్ట్రాలకు నదీ జలాలను తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

revanth reddy
'కమీషన్ల కోసమే జగన్​తో కుమ్మక్కు'

By

Published : Jun 2, 2020, 9:20 PM IST

కమీషన్ల కోసమే తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్యాయం చేస్తున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. శాంతియుతంగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తే అరెస్ట్​ చేశారన్నారు. జలాలను పక్క రాష్ట్రాలకు తరలించుకుపోతుంటే కాంగ్రెస్​ పార్టీ తరఫున చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. కేసీఆర్​ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. పటిష్ఠ కార్యాచరణతో పోరాటం చేస్తామని రేవంత్​రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్షకు సిద్ధమైన రేవంత్​రెడ్డిని కొడంగల్​ పోలీసులు అరెస్టు చేసి వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల పోలీస్​ స్టేషన్​కు తరలించారు. రేవంత్​ను విడిచిపెట్టాలంటూ కుల్కచర్ల పోలీస్​ స్టేషన్​కు కాంగ్రెస్​ కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి.. వాగ్వివాదానికి దిగారు. రేవంత్ రెడ్డి విడుదలతో గొడవ సద్దుమణిగింది.

'కమీషన్ల కోసమే జగన్​తో కుమ్మక్కు'

ఇవీచూడండి:సీఎం కాన్వాయ్​కి అడ్డొచ్చిన యువకుడు.. కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details