తెలంగాణ

telangana

ETV Bharat / state

మధ్యాహ్నం తర్వాత పోలింగ్​ కేంద్రాలకు సామగ్రి తరలింపు - mlc election polling arrangements in vikarabad

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్​ మోతీలాల్​ తెలిపారు. హైదరాబాద్​, రంగారెడ్డి, మహబూబ్​నగర్​ ఎమ్మెల్సీ బరిలో 93 మంది ఉండగా.. జిల్లాలోని ప్రతి పోలింగ్​ బూత్​కు జంబో బాక్సు, పెద్ద బాక్సులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 38 పోలింగ్​ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.

vikarabad election distribution centre
ఎమ్మెల్సీ ఎన్నికలకు సామగ్రి తరలింపు

By

Published : Mar 13, 2021, 1:24 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో ఎన్నికల అధికారులు అన్నీ సిద్ధం చేశారు. కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి పౌసుమి బసు పరిశీలించారు. అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. శనివారం మధ్యాహ్నం తరువాత పోలింగ్ అధికారులకు ఎన్నికల సామగ్రిని బట్వాడా చేయనున్నట్లు అదనపు కలెక్టర్​ మోతీలాల్​ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 25,958 మంది ఓటర్లకు గాను 38 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారని చెప్పారు.

ప్రతి పోలింగ్​ బూత్​కు జంబో బాక్సు, పెద్ద బాక్సులు పంపిణీ చేస్తున్నట్లు మోతీలాల్​ వెల్లడించారు. పోలింగ్ సామగ్రిని తరలించడానికి 9 బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటింగ్​ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:బడ్జెట్​ సమావేశాలపై భాజపా ఎమ్మెల్యేలకు బండి దిశానిర్దేశం

ABOUT THE AUTHOR

...view details