తెలంగాణ

telangana

ETV Bharat / state

కూతురు పెళ్లైన అరగంటకే తల్లి మృతి - వికారాబాద్​ తాజా వార్త

కూతురు పెళ్లి రోజు తల్లి మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో చోటు చేసుకుంది. పెళ్లింట  విషాదఛాయలు అలముకున్నాయి.

mother-dead-in-daughter-marriage-in-vikarabad
కూతురు పెళ్లిరోజే తల్లి మృతి

By

Published : Dec 2, 2019, 9:40 AM IST

వికారాబాద్​ కొడంగల్ మండలం పర్సాపూర్​ గ్రామానికి చెందిన రాములమ్మ నవంబర్​ 27న కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ కొడంగల్ పట్టణ శివారులో ఆటో ఢీకొని ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు తీవ్రగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొడంగల్ పట్టణ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రాములమ్మ పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కూతురు పెళ్లిరోజే తల్లి మృతి

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం రాములమ్మ మృతి చెందింది. కూతురు పెళ్లి జరిగిన అరగంట తర్వాత రాములమ్మ మరణవార్త తెలియడంతో పెళ్లికూతురు గూగులమ్మ తీవ్రంగా కన్నీటిపర్యంతమయ్యింది. పెళ్లి ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. వధూవరులు కన్నీటి పర్యంతం అవుతూ ఉంటే పెళ్లికి వచ్చిన చుట్టాలు వారిని చూసి శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ కార్యాలయ అటెండర్‌ మృతి

ABOUT THE AUTHOR

...view details