తెలంగాణ

telangana

ETV Bharat / state

కోతుల బెడదుంది.. పట్టిస్తే తగ్గుతుంది - కోతుల బెడద

ఒకప్పుడు అడవులకే పరిమితమైన కోతులు.. నేడు గ్రామాల్లో సంచరిస్తున్నాయి. తలుపు తెరిస్తే చాలు.. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడేసి పోతున్నాయి. అడ్డుకోవాలని చూస్తే.. మీద పడి దాడి చేస్తున్నాయి. ఇలా.. కోతులు కనిపిస్తే చాలు ఆమడ దూరం పారిపోవాల్సిన పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల నెలకొన్నాయి. వానరాల సంఖ్యను నియంత్రించేందుకు, వాటి దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం.. నిర్మల్​ జిల్లాలో కోతుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

monkey rehabilitation center in Nirmal district.
కోతుల బెడదుంది.. పట్టిస్తే తగ్గుతుంది

By

Published : Mar 22, 2021, 8:50 AM IST

‘‘సర్‌.. మా వికారాబాద్‌ నియోజకవర్గంలోని దారుల్‌ మండలంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పంటపొలాలను దెబ్బతీస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడుతున్నాయి. కేవలం మా ప్రాంతంలోనే కాదు.. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వానరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి..’’ శనివారం జరిగిన శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే తరహా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే ఉపయోగంలోకి వచ్చిన కోతుల నియంత్రణ, పునరావాస కేంద్రాన్ని అవగాహనా లోపం కారణంగా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
సగటున రోజుకు రెండే శస్త్రచికిత్సలు
నిర్మల్‌ జిల్లా కేంద్రం సమీపంలో దాదాపు పదెకరాల స్థలంలో నిర్మించిన కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం రాష్ట్రంలోనే తొలి పైలట్‌ ప్రాజెక్టు కాగా, దేశంలో రెండోది. గత డిసెంబరు 20న ఇది ప్రారంభమైంది. ఒకేసారి 75 కోతులను ఉంచడానికి అవకాశం ఉంది. రోజుకు 15 నుంచి 20 శస్త్రచికిత్సలు చేయవచ్చు. ఇప్పటివరకు 189 చేశారు. అంటే సగటున రోజుకు రెండు మాత్రమే. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం వడూర్‌ నుంచి 20కి పైగా పట్టుకొచ్చారు. ఇందులో పిల్లలు, గర్భంతో ఉన్నవాటిని మినహాయిస్తే 9 వానరాలకు శస్త్రచికిత్సలు చేశారు. సిబ్బంది అందుబాటులో ఉన్నా పట్టుకొస్తున్నవి పెద్దగా లేకపోవడంతో కేంద్రం పూర్తి స్థాయిలో సేవలందించలేకపోతోంది.

కోతుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్న వైద్య సిబ్బంది

ఏ ప్రాంతం నుంచైనా తేవొచ్చు
* రాష్ట్రంలోనే ఏకైక కేంద్రం కావడంతో ఏ ప్రాంతం నుంచైనా ఇక్కడకు కోతులను తేవొచ్చు.
* కేంద్రం ఇన్‌ఛార్జిగా ఉండే అటవీశాఖ అధికారికి ముందుగా సమాచారం అందిస్తే (సంప్రదించాల్సిన నెంబరు: 73375 52773) బోన్లు, సిబ్బందిని పంపిస్తారు.
* బోన్లు తీసుకెళ్లేందుకు, పట్టుబడ్డ వాటిని తీసుకొచ్చేందుకు అవసరమైన వాహనం, పట్టుకునేందుకు అవసరమయ్యే పండ్లు, ఆహార పదార్థాల ఖర్చును కావాల్సినవారే చెల్లించాలి.

కోతుల పునరావాస కేంద్రం
* ఒక్కో వానరానికి లాప్రోస్కోపిక్‌ విధానంలో కుటుంబ నియంత్రణ చేసేందుకు సగటున 20 నిమిషాల సమయం పడుతుంది.* ఏడాదిన్నర లోపు వయసున్న పిల్లలకు, గర్భంతో ఉన్నవాటికి శస్త్రచికిత్స చేయరు.* ఒకరోజు పరిశీలనలో ఉంచి శస్త్రచికిత్స చేస్తారు. ఇందుకు గుర్తుగా చెవుకు ట్యాగ్‌ వేస్తారు. అనంతరం మూడురోజుల పాటు బోన్లలో బంధించి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తారు. ఆ తర్వాత అడవుల్లో వదిలేస్తారు.

ఇదీ చదవండి:అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతున్న ఉల్లిధర

ABOUT THE AUTHOR

...view details