వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్, సొండేపూర్, రంగంపల్లిలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులు పొలాల్లో పనిచేస్తుండగా నేరుగా అక్కడికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
రైతు వేదికలకు శంకుస్థాపన చేసిన పల్లా, మహేశ్ రెడ్డి - vikarabad latest news
జిల్లాలో రైతు వేదికలకు నాయకులు భూమి పూజ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి పర్యటించి రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు.
రైతు వేదికలకు శంకుస్థాపన చేసిన పల్లా, మహేశ్ రెడ్డి
రైతులు ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తున్నారా లేదా, రైతుబంధు వస్తుందా లేదా అడిగారు. ప్రతి గ్రామంలో రైతు సమన్వయ కో-ఆర్డినేటర్లు, ఏఈవోలు సరిగా పని చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకన్నారు.