నియంత్రిత సాగు విధానంతో రైతులకు అధిక లాభాలుంటాయని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్, యాలాల, తాండూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. నియంత్రిత సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. లాభసాటి వ్యవసాయంతో రైతును రాజుగా చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో రైతులకు నియంత్రిత సాగుపై ఎమ్మెల్యే అవగాహన. - mla rohitreddy awareness camp in vikarabad
వికారాబాద్ జిల్లా పెద్దేముల్, యాలాల, తాండూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా రూపొందించిన నియంత్రిత సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.
జిల్లాలో రైతులకు నియంత్రిత సాగుపై ఎమ్మెల్యే అవగాహన
నూతన సాగు విధానాన్ని అవలంబిస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని ఎమ్మెల్యే సూచించారు. రానున్న వర్షాకాలం నుంచే కార్యచరణ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాలమూరు రంగారెడ్డి ఫేస్ 2 ద్వారా తాండూరుకు సాగునీరు, నియోజకవర్గంలోని ప్రతి ఎకరా సాగులోకి రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.