ఎమ్మెల్యేలకు ఎరకేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలపై తాండూరు తాండూరు రోహిత్ రెడ్డి స్పందించారు. న్యాయస్థానం తీర్పు ఆర్డర్ కాపీ చూశాక తమ తుది కార్యచరణ ప్రకటిస్తామన్నారు. భాజపా నేతలు చెప్పినట్లు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోందన్న రోహిత్ ఎలాంటి విచారణకైనా సిద్ధమని పునరుద్ఘాటించారు. సిట్‌లో సీనియర్ పోలీసు అధికారులు ఉన్నప్పటికీ సీబీఐకి అప్పగించాలని బీజేపీ వాదించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
'ఈడీ అధికారులకు ఏమీ దొరకలేదు అందుకే సీబీఐని రంగంలోకి దించారు'
విచారణలో ఈడీ అధికారులకు ఏమీ దొరకలేదని అందుకే సీబీఐని రంగంలోకి దించారని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో భాజపా నేతలు చెప్పినట్లు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోందన్న రోహిత్ ఎలాంటి విచారణకైనా సిద్ధమని పునరుద్ఘాటించారు. సిట్‌లో సీనియర్ అధికారులను కాదని.. సీబీఐకి ఇవ్వడం ఎంతవరకు సమంజసమైందన్నారు.
న్యాయవ్యవస్థను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రశ్నించిన ఆయన ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. తాను న్యాయవ్యవస్థను గౌరవిస్తానని... దానిపై నమ్మకం ఉందన్నారు. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
విచారణలో ఈడీ అధికారులకు ఏమీ దొరకలేదు.. అందుకే సీబీఐని రంగంలోకి దించారు.. సిట్‌లో సీనియర్ పోలీసు అధికారులను నియమించారు, వారు దర్యాప్తు చేస్తున్నప్పుడు సీబీఐకి ఇవ్వడం ఎంతవరకు సరైందని అడుగుతున్నా. రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించాలి- పైలెట్ రోహిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే