వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొమ్మరాసుపేట, కోస్గి మండలాల్లోని ఆటో యూనియన్ కార్మికులు, ఆశా కార్యకర్తలు, జర్నలిస్టులకు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామాల్లో పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. కొవిడ్-19 వ్వాప్తి చెందకుండా తీసుకోవాల్సిని జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. వైరస్ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రజలంతా.. మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్‌డౌన్‌లో స్వచ్ఛందంగా పాల్గొని... పోలీసులకు సహకరించాలని తెలిపారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన కొడంగల్ ఎమ్మెల్యే - mla patnam narender reddy distributed food items to poor people in kodangal constituency vikarabad district
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ వృత్తుల వారిని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఆటో యూనియన్ కార్మికులు, ఆశా కార్యకర్తలు, జర్నలిస్టులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన కొడంగల్ ఎమ్మెల్యే