తెలంగాణ

telangana

ETV Bharat / state

పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే.. తరలివచ్చిన భక్తులు - అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన భార్యతో కలిసి అయ్యప్పస్వామి మహా పడిపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

MLA participating in the ayyappa puja Devotees gathered at tandur vikarabad
పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే.. తరలివచ్చిన భక్తులు

By

Published : Dec 17, 2020, 12:45 PM IST

పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే.. తరలివచ్చిన భక్తులు

వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అయ్యప్ప మాల స్వీకరించిన నేపథ్యంలో బుధవారం మహా పడిపూజ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పూజ భారీ ఎత్తున జరిపారు.

ఈ కార్యక్రమంలో భార్య ఆర్తి రెడ్డితో కలిసి ఆయన పూజలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మహా పడిపూజలో స్వాముల ఆటపాటలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. శబరిగిరి శివుడిని పూలతో అందంగా అలంకరించారు.

మహోత్సవానికి అయ్యప్ప భక్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహా పడిపూజతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఇదీ చూడండి :భార్య కనిపించడం లేదని భర్త హల్​చల్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details