వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పర్యటించారు. బాల్రెడ్డి గూడ, అమ్రాది కుర్డు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధే సర్కారు లక్ష్యం: ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
తెరాస ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలంలో పలు అభివృద్ధి పనులను ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
గ్రామాభివృద్ధే సర్కారు లక్ష్యం: ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుపై గ్రామంలో ప్రభుత్వం సూచించిన పంటలు మాత్రమే పండిస్తామని రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, మోమిన్ పేట్ మండల అధ్యక్షురాలు వసంత వెంకట్, స్థానిక సర్పంచులు, పీఏసీఎస్ ఛైర్మన్ అంజిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తెరాస నాయకులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:సమ్మె విరమించిన గాంధీ జూడాలు
Last Updated : Jun 12, 2020, 5:49 PM IST