'రైతును రాజు చేయటమే ప్రభుత్వ లక్ష్యం' - parigi news
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పర్యటించారు. గ్రామంలో చేపట్టిన రైతు వేదిక భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
mla mahesh reddy visited in parigi constituency
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ రైతు వేదిక నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి తెలిపారు. పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలంలోని ముజాహిద్‌పూర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే రైతు వేదిక భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి తెలిపారు.