తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా కౌన్సిలర్లు ఇంట్లో.. భర్తలు అధికారిక కార్యక్రమాల్లో...

పరిగిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రేమ్​నగర్ కాలనీలో రాత్రి బస చేశారు. పలువురు అధికారులతో కలిసి వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా కౌన్సిలర్లకు బదులుగా వారి భర్తలు హాజరయ్యారు.

mla mahesh reddy spent the night in the colony at pargi vikarabad
వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

By

Published : Feb 24, 2020, 6:59 PM IST

వికారాబాద్ జిల్లా పరిగిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రేమ్​నగర్ కాలనీలో రాత్రి బస చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ మోతీలాల్, ప్రభుత్వ అధికారులు, వివిధ ప్రజా ప్రతినిధులతో కలిసి వార్డుల్లో తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రేమ్​నగర్​ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు, వీధిలైట్లను ప్రారంభించారు. అందరి సమన్వయంతో పరిగి మున్సిపాలిటీని ఆరోగ్య మున్సిపాలిటీగా మార్చుతామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రేమ్​నగర్ కాలనీలో 1, 13, 14, 15 వార్డులకు సంబంధించి మహిళా కౌన్సిలర్లకు బదులుగా వారి భర్తలు హాజరయ్యారు. 8వ వార్డు కౌన్సిలర్​కు బదులుగా వారి కుమారుడు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్​ను వివరణ కోరగా కౌన్సిలర్లందరికి సమాచారం ఇచ్చామన్నారు. కౌన్సిలర్లు మాత్రమే రావాలని సూచించినా వాళ్లు పట్టించుకోవడం లేదని వివరణ ఇచ్చారు.

వార్డుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

ఇదీ చూడండి :ఏం చేశారని నిలదీసిన స్థానికుడు... కోపానికొచ్చిన మంత్రి

ABOUT THE AUTHOR

...view details