తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే రోహిత్​ - mlc mahender reddy latest news

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే గుత్తేదారుపై చర్యలు తీసుకుంటామని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్ మండలాల్లో జరిగిన మండల పరిషత్​ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్నారు.

mla filet rohith reddy participated mandala parishath meets in vikarabad distirct
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే రోహిత్​

By

Published : Sep 5, 2020, 12:40 PM IST

వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్ మండలాల్లో జరిగిన మండల పరిషత్​ సర్వసభ్య సమావేశాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే గుత్తేదారుపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హెచ్చరించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు.

ప్రజల సంక్షేమం కోసం అధికారులు పనిచేయాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.

ఇదీ చూడండి:'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'

ABOUT THE AUTHOR

...view details