వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా క్రీడా అధికారి హనుమంత్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రన్లో స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. స్థానిక బ్లాక్ గ్రౌండ్ నుంచి ఎస్.ఎ.పి. కళాశాల వరకు సాగిన రన్లో ఆయన పరుగెత్తారు.
నిత్యం వ్యాయామం వల్ల ఆరోగ్య జీవనం: ఎమ్మెల్యే ఆనంద్ - vikarabad district latest news
ఆరోగ్యంగా జీవించాలంటే శరీర దృఢత్వం అవసరమని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రన్లో ఆయన పాల్గొన్నారు.
![నిత్యం వ్యాయామం వల్ల ఆరోగ్య జీవనం: ఎమ్మెల్యే ఆనంద్ MLA Anand started the run in Vikarabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9022907-701-9022907-1601635051485.jpg)
నిత్యం వ్యాయామం వల్ల ఆరోగ్య జీవనం: ఎమ్మెల్యే ఆనంద్
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిత్యం వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాల వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని సూచించారు. కార్యక్రమంలో అడిషనర్ కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్యలతో పాటు పలువురు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'కర్షకుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెడితే ఊరుకోం'