'కల్యాణలక్ష్మి’ ఎంతో మేలు: ఎమ్మెల్యే ఆనంద్ - Kalyanalakshmi Scheme cheques distributed
పేదల అభ్యున్నతికే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ భవనంలో కల్యాణ లక్ష్మి, షాదీముబార్‌కు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు భారం కావొద్దని సీఎం కేసీఆర్ సాయం అందజేస్తున్నారన్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ మంజుల, జడ్పీటీసీ ప్రమోదీని, ఎంపీపీ చంద్రకళ, పీఏసీఎస్ ఛైర్మన్ ముత్యంరెడ్డి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ సుబాషిణీ, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
vikarabad latest news
.