తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదికల పనుల్లో వేగం పెంచండి: ఎమ్మెల్యే ఆనంద్‌ - వికారాబాద్‌ మండలంలో ఎమ్మెల్యే ఆనంద్‌ పర్యటన

రైతులు ఇబ్బందులు పడకుండా వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు వేదికలు నిర్మిస్తున్నారన్నారు. మైలార్‌ దేవరంపల్లిలో పనులను పరిశీలించారు.

mla anand inspect raithu vedika construction works in-vikarabad-mandal
రైతు వేదికల పనుల్లో వేగం పెంచండి: ఎమ్మెల్యే ఆనంద్‌

By

Published : Aug 8, 2020, 3:53 PM IST

వికారాబాద్‌ మండలంలోని మైలార్‌దేవరంపల్లి, నారాయణ్‌పూర్‌, సిద్దులూరు, గొట్టిముక్కుల గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణంలో వేగం పెంచాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. మైలార్‌ దేవరంపల్లిలోనిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు.

అనంతరం స్థానిక ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ప్రకృతి వనాల ఏర్పాటు వల్ల చిన్నారులు, వృద్ధులు ఉదయం, సాయంత్రం సమయాల్లో సేద తీరేందుకు వీలవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తూ పనులు చేయిస్తున్నారన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు వేదికలు నిర్మిస్తున్నారన్నారు.

పులుమద్ది, మదన్‌పల్లి, మైలార్‌దేవరంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రకృతి వనాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య... సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details