వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని శివరాం నగర్ కాలనీలో ఎమ్మెల్యే ఆనంద్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ విద్యార్థిని ఇంటికెళ్లి ఆన్లైన్ తరగతులను పరిశీలించారు.
ఆన్లైన్ తరగతుల తీరుతెన్నులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆనంద్ - ఎమ్మెల్యే ఆనంద్ తాజా వార్తలు
విద్యార్థులు ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరాం నగర్ కాలనీలోని ఓ విద్యార్థిని ఇంట్లో ఆన్లైన్ తరగతుల తీరుతెన్నులను పరిశీలించారు.
![ఆన్లైన్ తరగతుల తీరుతెన్నులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆనంద్ MLA Anand examines the progress of online classes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8636905-529-8636905-1598948148241.jpg)
ఆన్లైన్ తరగతుల తీరుతెన్నులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆనంద్
సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న రక్షిత అనే విద్యార్థిని ఇంట్లోకి వెళ్లి.. ఆన్లైన్ క్లాసుల తీరుతెన్నులను పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థినికి పలు సూచనలు చేశారు. నేరుగా వినే తరగతులకు, ఆన్లైన్ తరగతులకు వ్యత్యాసం ఉన్నా.. శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. ఏవైనా అనుమానాలుంటే ఉపాధ్యాయులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు.
ఇదీచూడండి.. వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే..