తెలంగాణ

telangana

ETV Bharat / state

వారందరి సేవలు వెలకట్టలేనివి: ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​ - వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యులు దేవుళ్లు అయ్యారని వికారాబాద్​ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. ప్రాణాలకు తెగించి కరోనాతో వారు యుద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.

vikarabad district latest news
vikarabad district latest news

By

Published : May 23, 2020, 8:07 PM IST

వికారాబాద్​లో సబితా ఆనంద్ హాస్పిటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ దంపతులు సన్మానించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.

కరోనా నివారణకు వీరు చేసిన కృషి చాలా గొప్పదన్నారు ఎమ్మెల్యే ఆనంద్​. కరోనా రోగులను గుర్తిచడంలో ఆశా వర్కర్లు కృషి చేశారని పేర్కొన్నారు. కరోనా విస్తరించకుండా పారిశుద్ధ్య కార్మికులకు నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details