తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతును రాజును చేయడమే కేసీఆర్ లక్ష్యం: మంత్రులు - kodangale news updates

కొడంగల్ నియోజకవర్గాన్ని... సిరిసిల్ల తరహాలో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి జరుగుతోందన్నారు మంత్రులు సత్యవతి రాఠోడ్, సబితా ఇంద్రారెడ్డి. నియోజకవర్గంలో మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

Ministers visited kodangale constituency
సిరిసిల్ల తరహాలో కొడంగల్: మంత్రులు

By

Published : Jun 23, 2020, 4:24 PM IST

రైతే రాజు అన్న మాటను నిజం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్... నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్‌ ప్రశంసించారు. వికారాబాద్​ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బొమ్మరాసిపేట్ మండలం మెట్ల గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

సూర్యనాయక్ తండాలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చిందని మంత్రులు గుర్తుచేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘతన కేసీఆర్​కే దక్కిందన్నారు. మంత్రి కేటీఆర్ హామీ మేరకు కొడంగల్ నియోజకవర్గాన్ని.. సిరిసిల్ల తరహాలో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి జరుగుతోందన్నారు.

అందుకు మంత్రి కేటీఆర్... నిరంతరం సమీక్షిస్తున్నారని మంత్రులు తెలిపారు. ఈ ప్రాంతంలో గిరిజనులు అధికంగా ఉన్నారని.. వాళ్ల కోసం సంక్షేమ భవనంతోపాటు కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:'కరోనాను వ్యాపారంగా చూడొద్దు.. అనవసరంగా పరీక్షలు చేయొద్దు'

ABOUT THE AUTHOR

...view details