తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిగిలో మంత్రుల పర్యటన... లఖ్నాపూర్​ చెరువులో చేపపిల్లల విడుదల - పరిగిలో తలసాని, సబితా పర్యటన

రాష్ట్రంలో కులవృత్తులను బలోపేతం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే... ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ministers-sabitha-and-talasani-srinivas-yadav-tour-in-parigi-at-vikarabad-district
పరిగిలో మంత్రుల పర్యటన... లఖ్నాపూర్​ చెరువులో చేపపిల్లల విడుదల

By

Published : Aug 27, 2020, 3:49 PM IST

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం.. కులవృత్తులకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్​ చెరువులో చేప పిల్లలను వదిలారు.

చేప పిల్లల నాణ్యత, పరిమాణం, లెక్కకు సంబంధించిన అంశాల్ని సొసైటీ సభ్యులే చూసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ఆంధ్రా మద్యం తాగితే 2, 3 ఏళ్లకే హరీ అంటారు'

ABOUT THE AUTHOR

...view details