ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో వికారాబాద్ జిల్లా అనంతగిరిలో 200 పడకల కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ టీబీ ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌కు కావాల్సిన వసతులు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. సీఎం కేసీఆర్ అనంతగిరిలో ఐసోలేషన్ సెంటర్‌తో పాటు డ్రగ్ స్టోర్‌ను, ఆర్టీపీసీఆర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో నగరం నుంచి మందులను తెచ్చుకునే వారమని చెప్పారు.
అనంతగిరి టీబీ ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజా వార్తలు
ప్రజల సహకారం లేనిదే కనిపించని శత్రువును అంతం చేయడం సాధ్యం కాదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని టీబీ ఆసుపత్రిని ఆమె పరిశీలించారు.
త్వరలో ఆర్టీపీసీఆర్ సెంటర్‌ను అనంతగిరిలో ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. కరోనాతో కుటుంబాలు, వ్వవస్థలు చితికిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ రోజుకు 15 గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూన్నారని తెలిపారు. వైద్య పరీక్షలకు అధిక డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. సిటీ స్కాన్‌కు 2500 రూపాయలు మాత్రం చెల్లించాలని సూచించారు. అంతకంటే ఎక్కువ డబ్బులు ఎవరైనా తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని మంత్రి సూచించారు.
ఇదీ చదవండి:గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం