తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె ప్రగతి కోసమే 30 రోజుల ప్రణాళిక: సబిత - Minister sabitha review at vikarabad collectrate

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. వికారాబాద్​ కలెక్టరేట్​లో మంత్రి సమీక్ష నిర్వహించారు.

30 రోజులు కాదు 365 రోజుల పాటు సాగాలి

By

Published : Oct 22, 2019, 6:43 PM IST

గ్రామాల్లో నెల రోజుల ప్రణాళిక కార్యక్రమం.. సంవత్సరం పాటు కొనసాగాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్​లో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్.. ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారని పేర్కొన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని పారిశుద్ధ్య కార్మికులకు వేతనాన్ని రూ.8,500కు పెంచడమే కాకండా రూ. 2 లక్షల బీమా వర్తంపజేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో 10 వేల జనాభా ఉంటే 28 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించుకునే అధికారం.. ప్రభుత్వం పాలనాధికారికి ఇచ్చిందని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి సర్కారు ప్రతినెల రూ. 339 కోట్లు ఇస్తుందన్నారు. శివారెడ్డి పేట ప్రభుత్వ పాఠశాలను మంత్రి సబిత ఆకస్మిక తనిఖీ చేశారు.

30 రోజులు కాదు 365 రోజుల పాటు సాగాలి

ABOUT THE AUTHOR

...view details