రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, రైతును రాజును చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నిరంతరం పరితపిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నర్సాపూర్ గ్రామంలో రైతు వేదిక భవనంతో పాటు పల్లె ప్రకృతి వనాన్ని ఆమె ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని మంత్రి సబిత తెలిపారు. వ్యవసాయానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు.
రైతును రాజును చేయడమే ముఖ్యమంత్రి ధ్యేయం: సబిత - telangana varthalu
రైతును రాజును చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని మంత్రి వెల్లడించారు.

గ్రామాల్లో ఉన్న రైతుల సమస్యలు చర్చించుకోవడానికి ఈ రైతు వేదికలు ఉపయోగపడతాయన్నారు. ఈ రైతు వేదికలలో వ్యవసాయ అధికారులు వచ్చి రైతులకు సలహాలు, సూచనలు కూడా అందజేస్తారన్నారు. ఈ వేదికలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ నాగరాణి, సర్పంచ్ సయ్యద్ అంజాద్, తెరాస అధికార ప్రతినిధి మధుసూదన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రూ.2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి అనుమతి