తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్కరూ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని అన్నదాతలు గుర్తించాలని సూచించారు.

minister-sabitha-indra-reddy-review-meeting-with-officials
కరోనాపై అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష

By

Published : Apr 24, 2020, 7:45 PM IST

కరోనాపై అధికారులతో వికారాబాద్​ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని హైదరాబాద్, వికారాబాద్, గద్వాల్, సూర్యాపేటలో కరోనా కేసుల ఎక్కువుగా నమోదవుతున్న నేపథ్యంలో... సీఎం కేసీఆర్ వీటిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. దీనిలో భాగంగానే ఒక్కో జిల్లాకు ఉన్నత స్థాయి అధికారిని అదనంగా నియమించారని పేర్కొన్నారు.

ఆ విషయాన్ని గమనించండి..

ఏ మతానికి చెందిన వారైనా సరే సామూహిక పూజలు, ప్రార్థనలు చేయకూడదని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తికావడంతో గతంలో కంటే ఈ సారి అధిక దిగుబడులు వచ్చాయని... వాటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్​లైన్ క్లాసెస్ కొనసాగుతున్నాయని... తల్లిదండ్రులు దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఆన్​లైన్​ క్లాసెస్ వినే విధంగా చూసుకోవాలన్నారు.

అక్కడ కంచెలు తీసేయండి..

కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రస్తుతం కేసులు నమోదు కాకపోతే కాలనీలకు ఏర్పాటుచేసిన కంచెలను తీసివేయాలని అధికారులకు సూచించారు. కానీ ప్రజలు ఎవరు ఇళ్లల్లో నుంచి బయటకు రాకూడదని... అత్యవసరమైతే తప్ప ఎవరు రోడ్లపైకి రాకూడదన్నారు. ఈ సమావేశంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎంహెచ్​ఓ హాజరయ్యారు.

ఇవీ చూడండి:మెతుకు సీమను ముద్దాడిన గోదారమ్మ

ABOUT THE AUTHOR

...view details