వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూమి పూజ చేశారు. అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయితే బాలికలకు చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రిన్సిపల్ దేవి అన్నారు. పాఠశాల పరిస్థితులపై ఈటీవీ భారత్లో 'సమస్యలకు నిలయం ఆ పాఠశాల' అనే శీర్షికతో ఒక కథనం ప్రచురించగా... స్పందించిన అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈటీవీ భారత్కు స్పందన: కేజీబీవీకి అదనపు తరగతులు - హైదరాబాద్ వార్తలు
కుల్కచర్ల మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పరిస్థితులపై ఈటీవీ భారత్లో 'సమస్యలకు నిలయం ఆ పాఠశాల' అనే శీర్షికతో ఒక కథనం ప్రచురించగా... అధికారులు స్పందించారు. పాఠశాలకు అదనపు తరగతుల కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూమి పూజ చేశారు.
ఈటీవీ భారత్కు స్పందన: కేజీబీవీకి అదనపు తరగతులు
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి, జిల్లా విద్యాధికారి రేణుక దేవి, సర్పంచ్ సౌమ్యా వెంకట్రాం రెడ్డి, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:తెలంగాణ సోనాతో.. మధుమేహం నియంత్రణ