తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లాలో నాటిన మొక్కలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా... - vikarabad district news

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి అటవీ ప్రాంతంలో నాటిన 35 వేల 400 మొక్కల సంరక్షణపై అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. మొక్కలను సంరక్షిస్తున్న అటవీ శాఖ అధికారుల పనితీరును అభినందించారు.

Minister Sabita Indrareddy inquired about the plants planted in vikarabad district
నాటిన మొక్కలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా...

By

Published : Jul 22, 2020, 2:27 PM IST

మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి అటవీ ప్రాంతంలో నాటిన 35 వేల 400 మొక్కల సంరక్షణపై అధికారులను ఆరా తీశారు.

మొక్కలను సంరక్షిస్తున్న అటవీ శాఖ అధికారుల పనితీరును అభినందించారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పోలీస్​ స్టేషన్​లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details