తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి సబిత - minister sabita latest

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. రాఘవపూర్, సుల్తాన్ పూర్ గ్రామాలలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.

 grain purchasing centers in parigi
grain purchasing centers in parigi

By

Published : Apr 27, 2021, 10:34 PM IST

మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. దళారులను నమ్మి మోసపోకుండా.. కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని వివరించారు. పరిగి మండలం రాఘవపూర్, సుల్తాన్ పూర్ గ్రామాలలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు.

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. కేంద్రాల్లో మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సబితా రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి, ఎమ్మెల్వే కొప్పుల మహేశ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'కొవిడ్​ రెండో దశ వ్యాప్తికి కేంద్రమే కారణం'

ABOUT THE AUTHOR

...view details