తెలంగాణ

telangana

ETV Bharat / state

'రేవంత్‌ రెడ్డి త్వరలోనే ఊచలు లెక్కబెడతారు - జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా?' - కొడంగల్​లో కేటీఆర్ ప్రచారం

Minister KTR Road Show at Kodangal : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లి చిప్పకూడు తింటారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ సీఎం అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Minister KTR Road Show at Kodangal
Minister KTR Road Show at Kodangal

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 5:33 PM IST

Updated : Nov 9, 2023, 7:39 PM IST

Minister KTR Road Show at Kodangal : వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో బీఆర్​ఎస్​ అభ్యర్థి పట్నం మహేందర్​రెడ్డికి మద్దతుగా మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్‌ రెడ్డిని ప్రజలు గెలిపించాలని కోరారు. కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా నరేందర్‌ రెడ్డికి ప్రమోషన్‌ ఇప్పిస్తానని పేర్కొన్నారు. మళ్లీ ఓటమి ఎందుకని రేవంత్‌రెడ్డి నామినేషన్‌ వెనక్కి తీసుకుంటారని ఎద్దేవా చేశారు.

ఆర్మూర్‌లో ప్రచార రథం పైనుంచి ముందుకు పడిన కేటీఆర్‌ - స్వల్ప గాయాలు

BRS Election Campaign 2023 : ఈ సందర్భంగా దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకెళ్తోందని కేటీఆర్‌ తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంటు పోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటక రైతులు కొడంగల్‌ వచ్చి ధర్నాలు చేస్తున్నారని.. ఆ పార్టీకి అధికారం కట్టబెట్టినందుకు ఆ రాష్ట్ర ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కొడంగల్‌ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్‌ రెడ్డిని దుయ్యబట్టారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొడంగల్‌ను అద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని.. రెండేళ్లలో కొడంగల్‌లోని 1.25 లక్షల ఎకరాలకు కృష్ణా నీళ్లిస్తామని స్పష్టం చేశారు.

రాజకీయంగా జన్మనిచ్చి- విదేశాల్లో గుర్తిపునిచ్చింది సిరిసిల్ల ప్రజలే : కేటీఆర్

రేవంత్‌ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లి చిప్పకూడు తింటారని కేటీఆర్‌ పేర్కొన్నారు. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి డబ్బులను నమ్ముకున్నారని.. లీడర్లను కొంటున్నారని మంత్రి ఆరోపించారు. కొడంగల్‌ ప్రజలను మాత్రం రేవంత్‌రెడ్డి కొనలేరన్నారు. మోసాన్ని మోసంతోనే జయించాలన్న కేటీఆర్.. కాంగ్రెస్‌ నేతలు అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఇస్తే తీసుకోవాలన్నారు. ఎన్నికల రోజున మాత్రం కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

కొడంగల్‌ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్‌ రెడ్డి. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌. కొడంగల్‌ను అద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. రెండేళ్లలో కొడంగల్‌లోని 1.25 లక్షల ఎకరాలకు కృష్ణా నీళ్లిస్తాం. రేవంత్‌రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లి చిప్పకూడు తింటారు. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా? - మంత్రి కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి త్వరలోనే ఊచలు లెక్కబెడతారు జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా

9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే : కేటీఆర్‌

రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల కోసం కొత్త కార్యక్రమాలు తెస్తామని కేటీఆర్‌ తెలిపారు. సౌభాగ్యలక్ష్మి కింద ప్రతి ఆడబిడ్డ ఖాతాలో రూ.3 వేలు వేస్తామన్నారు. గ్యాస్‌ సిలిండర్‌పై పెంచిన రూ.800 భరించి.. రూ.400కే ఇస్తామని చెప్పారు. తెల్ల కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల కేసీఆర్‌ బీమా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పట్నం నరేందర్​రెడ్డిని గెలిపిస్తే కొడంగల్‌లో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. వంద ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కు, ఇంజినీరింగ్‌, నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

గులాబీల జెండాలే రామక్క - మన రామన్న స్టెప్పేసిండే రామక్క

కేసీఆర్‌ను ఖతం చేసేందుకు దిల్లీ నుంచి దండయాత్ర చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. మోదీ, రాహుల్‌, ఖర్గే, కేంద్రమంత్రులు, సామంతులు దిల్లీ నుంచి వస్తున్నారన్నారు. తెలంగాణ గొంతుకను పిసికేందుకు మూకుమ్మడిగా వస్తున్నారన్న కేటీఆర్‌.. తెలంగాణ గొంతుకను అందరూ కాపాడుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే కరెంటు కావాలా? కాంగ్రెస్‌ కావాలా? రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? స్కీములు కావాలా? స్కాములు కావాలా? జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకు వెళ్లే ఎమ్మెల్యే కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కష్టంలో.. సుఖంలో తోడుగా ఉండే నరేందర్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు.

'కేసీఆర్ నవంబర్‌ 30న బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడం ఖాయం'

Last Updated : Nov 9, 2023, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details