వికారాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... సురభి వాణిదేవి పేరు ప్రకటించిన నాడే మన గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. తన విద్యా సంస్థల ద్వారా వేల మంది విద్యావంతులను సమాజానికి అందించారన్నారు.
తెరాసను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. మంచి మెజారిటీ కోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. తెరాస పార్టీ అనేది రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అని తెలిపారు.