విద్యుదాఘాతంతో ఓ వలస కూలి మరణించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్‌లో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన రమేశ్ సింగ్(40) మండల పరిధిలోని అల్లాపూర్ శివారులో ఓ పాలిష్ యూనిట్లో కూలిగా పనిచేస్తున్నాడు. నాపరాయి పాలిష్ చేసిన తర్వాత వెలువడే వ్యర్థాలను తొలగించేందుకు ట్యాంకర్‌ను తీసుకొచ్చాడు.
విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి - crim news in thandur
వికారాబాద్ జిల్లా తాండూర్‌లో విషాదం నెలకొంది. అల్లాపూర్ శివారులో ఓ పాలిష్ యూనిట్లో పనిచేస్తున్న వలసకూలీ... ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
వ్యర్థాన్ని పైపు ద్వారా ట్యాంకులో నింపడానికి రమేశ్ ఉపక్రమించాడు. ఈ క్రమంలో పైపులు పైకెత్తాడు. అతని మీదనే విద్యుత్ తీగలు ఉన్నాయని గుర్తించలేక పోయాడు. రమేశ్ చేతిలో ఉన్న పైపు విద్యుత్ తీగలకు తాకగా... షాక్ తగిలింది. ట్యాంకర్‌పై నుంచి రమేశ్ కింద పడిపోవటంతోనే... తోటి కూలీలు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు... రమేశ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.