వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం ఘనపురం గ్రామంలోని పలు తండాల్లోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవల బొంబయి, పూణె నుంచి వచ్చిన కొంతమందిని వైద్యులు పరీశీలించారు. లాక్‌డౌన్ అమలవుతోన్న సమయంలో కొందరు సొంత వాహనాలపై తండాలకు వచ్చారు.
పలు తండాల ప్రజలకు వైద్య పరీక్షలు
లాక్‌డౌన్ అమలవుతోన్న సమయంలో ద్విచక్ర వాహనాల ద్వారా ఘనపురం గ్రామంలోని పలు తండాలకు కొంతమంది వచ్చారు. వీరందరికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ముందు జాగ్రత్త చర్యగా వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు.
పలు తండాల ప్రజలకు వైద్య పరీక్షలు
వీరందరికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇలా వచ్చిన వారు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని డాక్టర్ మురళీకృష్ణ కోరారు.
ఇదీ చదవండి:గిరిపుత్రులను వెంటాడుతున్న కరోనా భయం