ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి సుధాకర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఇద్దరు పిల్లలొద్దు ఒక్కరే ముద్దు, జనభా అరికట్టండి.. దేశాభివృద్ధికి తోడ్పడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేస్తూ వైద్య సిబ్బంది ర్యాలీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకూ ర్యాలీ సాగింది.
జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది ర్యాలీ - medical staff
రోజు రోజుకు పెరుగుతున్న జనాభాను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డిప్యూటీ డీఎంహెచ్వో తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లాలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది ర్యాలీ